ఐఎంజీల మాదిరిగా ైస్టెపెండ్ చెల్లించండి
ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్(ఎఫ్ఎంజీ)ల ఆందోళనతో గురువారం డీఎంఈ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్(ఐఎంజీ) మాదిరిగానే తమకూ రూ.29,792 చెల్లించాలనే డిమాండ్‌తో ఎఫ్‌ఎంజీలు కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కేవలం రూ.5వేల ైస్టెపెండ్తో రోజువారీ భోజన, రవాణా ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
- డీఎంఈ కార్యాలయం ఎదుట ఎఫ్‌ఎంజీల నిరసన
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్(ఎఫ్ఎంజీ)ల ఆందోళనతో గురువారం డీఎంఈ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్(ఐఎంజీ) మాదిరిగానే తమకూ రూ.29,792 చెల్లించాలనే డిమాండ్‌తో ఎఫ్‌ఎంజీలు కోఠిలోని డీఎంఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. కేవలం రూ.5వేల ైస్టెపెండ్తో రోజువారీ భోజన, రవాణా ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు.
ఐదు నెలల నుంచి రూ. 5 వేలు సైతం చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపాల్సిన అధికారులు ఇంటర్న్‌షిప్ రద్దు చేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం, ఆరోగ్యశాఖ మంత్రి వెంటనే జోక్యం చేసుకుని తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డిమాండ్ చేశారు. డీఎంఈ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న ఎఫ్ఎంజీలను పోలీసులు అరెస్ట్ చేసి నాలుగు డీసీఎం వ్యాన్లలో చిక్కడపల్లి పీఎస్‌కు తరలించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

