సింగరేణి సిగలో జల సౌరభం!
రామగుండం ఎన్టీపీసీ | రామగుండం ఎన్టీపీసీ ఒడిలో రూపుదిద్దుకుంటున్న దేశంలోనే అతిపెద్ద 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు ప్రకియ

- శరవేగంగా ఫ్లోటింగ్ సోలార్ పనులు
- రూ.423 కోట్ల వ్యయంతో ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో ఏర్పాటు
- దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా ఖ్యాతి
- ఈ నెలాఖరుకల్లా విద్యుదుత్పత్తికి చర్యలు
- తీరనున్న రాష్ట్ర కరెంట్ అవసరాలు
పెద్దపల్లి, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రామగుండం ఎన్టీపీసీ ఒడిలో రూపుదిద్దుకుంటున్న దేశంలోనే అతిపెద్ద 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటు ప్రకియ శరవేగంగా సాగుతున్నది. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్తుకు దీటుగా సంప్రదాయేతర ఇందన వనరులపై దృష్టి సారించిన ఎన్టీపీసీ సోలార్ ప్రాజెక్టులను చేపట్టింది. కొన్నేండ్ల క్రితమే ఎన్టీపీసీ ఆవరణలో 10 మెగావాట్ల ప్లాంటును ఏర్పాటు చేసి సత్ఫలితాలు సాధించింది. దానిని 100 మెగావాట్లకు పెంచేందుకు ప్రణాళికలను సైతం రూపొందించింది. కాగా, భూసేకరణ సమస్య లేకుండా రామగుండంలోని ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో నూతన సాంకేతికతో నీటిపై తేలియాడే ఫొటా వోల్టాయిక్ ప్యానల్స్‌తో సరికొత్త సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని భావించింది. 2019 జూన్ 10న ఎల్వోఏ(లెటర్ ఆఫ్ అవార్డు)తో రూ.423.62 కోట్ల (జీఎస్టీ) వ్యయంతో టెండర్ అవార్డు దక్కించుకున్న బీహెచ్ఈఎల్ షెడ్యూల్ ప్రకారం చకచకా పనులు చేపట్టింది. ఈ నెలాఖరులో ఏప్రిల్ నాటికి ప్లాంటులో విద్యుదుత్పత్తిని టార్గెట్‌గా పెట్టుకుంది.
విజయవంతమైతే మరిన్ని రిజర్వాయర్లపైనా..
దేశంలోనే తొలిసారిగా 450 ఎకరాల్లో చేపట్టిన ఫ్లోటిం గ్ సోలార్ ప్లాంట్ విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర రిజర్వాయర్లపైనా ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నది. కాళేశ్వరం ప్రాజెక్టుపై సైతం మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి దాకా 111 కిలోమీటర్ల నదిపై సైతం నిర్మాణానికి ప్రతిపాదనలు ఇప్పటికే పంపింది. కరీంనగర్ ఎల్ఎండీపై సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నీటిపై తేలియాడే సోలార్ ప్లాంట్ నిర్మాణానికి ఇప్పటికే చర్యలు చేప ట్టింది. రాష్ట్రంలోని మరిన్ని జలాశయాలపై సైతం సోలార్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసే అవకాశమున్నది.
450 ఎకరాల్లో ప్లాంట్
ఎన్టీపీసీ రిజర్వాయర్‌లో 450 ఎకరాల విస్తీర్ణంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక ప్యానల్ సామర్థ్యం 325 వాట్స్. ప్లాంట్ విస్తీర్ణం 260 మీటర్ల పొడవు, 120 మీటర్ల వెడల్పు. ప్యానల్స్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్తు నేరుగా 16ఏ వినియోగంతో ఏసీ కరెంట్‌గా మారుతుంది. అనంతరం 630 కేవీ ఇన్వర్టర్ల నుంచి 33 కేవీ లైన్ ద్వారా రామగుండంలోని 132 కేవీ సబ్‌స్టేషన్‌తో గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. నాలుగు నెలల నుంచి నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. ప్రస్తుతం నీటిపై సౌర పలకల ఏర్పాటుకు కావల్సిన సోలార్ మాడ్యులర్స్ ఫ్లోటింగ్ యాంకర్స్(స్టాండ్) పనులు చివరి దశకు చేరాయి. వాటిపై అమర్చనున్న తేలియాడే పొటాన్ వోల్టాయిక్ ప్యానల్స్ బిగింపు పనులను యూనివర్సల్ ట్రాన్స్ఫార్మర్, ఆర్కేన్ ఏజెన్సీలు చేపడుతున్నాయి. మొత్తం ఐదు లక్షల ప్యానెల్స్ అవసరం కాగా, ఇప్పటివరకు రెండు లక్షలకు పైగా ప్యానెల్స్ వచ్చాయి.
ఇవీ కూడా చదవండి…
ఎస్‌హెచ్‌జీలకు రికార్డు రుణాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

