హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌లో వెలిసిన పోస్టర్లు, హోర్డింగ్‌లు (Posters, Hordings) కలకలం సృష్టించాయి. వాషింగ్ పౌడర్ నిర్మా (Washing powder Nirma).. వెల్కమ్ (welcome) టు అమిత్ షా (Amit shah) అంటూ.. గుర్తుతెలియని వ్యక్తులు నగరవ్యాప్తంగా హోర్డింగ్‌లు ఏర్పాటుచేశారు. నిర్మా సర్ఫ్‌తో బట్టలపై మరకలు మాయమై పోయినట్లు.. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో (BJP) చేరితే వారికి అంటిన మరకలు కూడా పోతాయని చురకలంటిస్తూ అమిత్ షా పర్యటిస్తున్న మార్గాల్లో పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. నిర్మా అడ్వర్టైజ్లో కనిపించే అమ్మాయి (Nirma girl ) తల ప్లేస్‌లో బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మ, నారాయణ్ రాణె, సువేందు అధికారి, సుజనాచౌదరి, జ్యోతిరాదిత్య సింధియా, ఈశ్వరప్ప సహా పలువురు నేతల ఫొటోలను ఉంచారు.
Welcome Amit Shah ! ! pic.twitter.com/J28jCJBU7p
— Krishank (@Krishank_BRS) March 12, 2023
ఎమ్మెల్సీ కవితకు మద్దతుగా బైబై మోదీ అంటూ హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలో శనివారం పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరగానే కేసులు మాయమంటూ.. ఇటీవల బీజేపీలో చేరిన పలువురి ఫొటోలను ప్రదర్శించారు. బీజేపీలో చేరితే అవినీతి మరకలు కాషాయంలోకి మారిపోతాయని.. అలాగే కవిత ఫొటోపై అసలైన రంగుల వెలసిపోవు అంటూ పోస్టర్లు అంటించారు.
Washing Powder Nirma!
This is called Karma @AmitShah ji
Welcome To Hyderabad 😀 pic.twitter.com/kDU03IeOrm
— Akshay (@AkshayBRS) March 12, 2023