కోటగిరి, అక్టోబర్ 8: సమైక్య పాలనలో ఒక ఇంట్లో ఒక ప్రభుత్వ సంక్షేమ పథకం వర్తిస్తే మరో పథకం రాకపోయేది. స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో అర్హులందరికీ పథకాలు దరిచేరుతున్నాయి. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సోంపూర్కు చెందిన అంజవ్వ కుటుం బమే ఇందుకు నిదర్శనం. మేడే అంజవ్వకు ఇద్దరు కొడుకులు, ఓ కుమార్తె. అంజవ్వ భర్త గతంలోనే మృతిచెందాడు. గుడిసెలో నివసిస్తున్న వీరికి డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. ఆమె కూతురు వసంత పెండ్లికి కల్యాణలక్ష్మి డబ్బులు వచ్చాయి. గొర్రెల పంపిణీ పథకం కింద లక్ష విలువైన 20 గొర్రెలు వచ్చాయి. 4 ఎకరాల భూమికి రైతుబంధు సాయం అందుతున్నది. అంజవ్వకు వితంతు పింఛన్ కింద ప్రతినెలా రూ.2,116 వస్తున్నది. వసంత కేసీఆర్ కిట్ పొందారు. తమ కుటుంబానికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్ను ఎన్నటికీ మరువమని అంజవ్వ చెబుతున్నారు.