సింగరేణి ఆక్సిజన్ ప్లాంట్లు

- నాలుగు దవాఖానల్లో ఏర్పాటు
- 2 కోట్ల ఖర్చుతో సదుపాయం
- సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ వెల్లడి
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి దవాఖానల్లో నాలుగు చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లను రూ.2 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయనున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. దీనితోపాటు కొవిడ్ సెంటర్లకు అవసరమైన వెంటిలేటర్లు, అత్యవసర సేవల వైద్య పరికరాల కొనుగోలుకు రూ.3.15 కోట్లను మంజూరుచేశారు. వెంటనే కావాల్సిన వైద్య పరికరాలు కొనుగోలుచేసి, ఆయా దవాఖానలకు సరఫరా చేయాలని సీఎండీ ఆదేశించారు. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా కొవిడ్ వార్డులు, క్వారంటైన్ సెంటర్లలో ఆక్సిజన్ కొరత లేనప్పటికీ.. భవిష్యత్తులో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున ఆక్సిజన్ కొరత రాకుండా సొంతంగా ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. వీటిని భద్రాద్రి కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన దవాఖాన, భూపాలపల్లిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్, మంచిర్యాలలోని రామకృష్ణాపూర్ సింగరేణి దవాఖాన, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా బెల్లంపల్లి సింగరేణి ఏరియా దవాఖానల్లో ఏర్పాటుచేయనున్నారు. ఐదారు వారాల్లో వీటి నిర్మాణం పూర్తిచేయాలని ఆర్డర్ పొందిన నిర్మాణ సంస్థలను సీఎండీ ఆదేశించారు. ఈ ఆక్సిజన్ ప్లాంట్లు గంటకు 12 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాయి. దీనితోపాటు రామగుండం ఏరియా దవాఖానలో ఏర్పాటుచేసే మరో పెద్ద ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ చివరి దశకు చేరుకొన్నది. ఈ ప్లాంట్ నుంచి రోజుకు 80 నుంచి వంద సిలిండర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. దీని నిర్మాణం కూడా ఆరు వారాల్లో పూర్తవుతుంది. కొవిడ్ సమయంలో విద్యుత్ సంస్థలకు బొగ్గు కొరత రాకుండా కార్మికులు తగు జాగ్రత్తలతో ఉత్పత్తిచేస్తున్నారని, తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ర్టాల్లోని అన్ని విద్యుత్ సంస్థలకు 2-4 వారాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా రవాణాచేస్తున్నట్టు వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Russia-Ukraine War | రష్యాపై వెయ్యి డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి.. భారీగా మంటలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

