తాండూరు, డిసెంబర్ 23 : భూమి పట్టా కోసం లంచం తీసుకుంటూ వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్ కలెక్టర్ (ఆర్డీవో) కార్యాలయ ఏవో, సీనియర్ అసిస్టెంట్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దుద్యాల మండల కేంద్రంలోని ల్యాండ్ ఫార్మేషన్ రోడ్డు కోసం నిర్ణయించిన 6 ఎకరాల 26 గుంటల భూమి పట్టా కోసం, భూమి స్వభావాన్ని మార్చడం కోసం ఓ వ్యక్తిని తాండూరు సబ్ కలెక్టర్ (ఆర్డీవో) కార్యాలయ ఏవో దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్‌రావు రూ.5లక్షలు లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తాండూర్లోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సదరు వ్యక్తి నుంచి రూ.5లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఏవో, సీనియర్ అసిస్టెంట్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు.. ఏవో దానయ్య, అసినియర్ అసిస్టెంట్ మాణిక్‌రావును అదుపులోకి తీసుకొన్నారు.