Parliament session | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లును తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఒకే దేశం-ఒకే ఎన్నిక, ఉమ్మడి పౌరస్మృతి, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులతో పాటు జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ, ఇన్సూరెన్స్ సవరణ బిల్లులను మోదీ సర్కార్ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉన్నదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే ఇటీవల వర్షాకాల సమావేశాల్లో కొత్తగా ప్రవేశపెట్టిన నేర న్యాయ బిల్లులను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేసిన నేపథ్యంలో.. వాటిని సభ ముందు పెట్టే చాన్స్ లేదని తెలిపాయి. ఇదే సమయంలో జీ20 సమావేశాలకు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఒక ప్రత్యేక తీర్మానం చేయనున్నదని పేర్కొన్నాయి.
పార్లమెంటు ‘ప్రత్యేక భేటీ’గతంలో ఎప్పుడు?
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. రెండున్నర వారాల క్రితమే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత అర్జెంటుగా పార్లమెంటు సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఏమొస్తున్నదని రాజకీయ పక్షాలతోపాటు సామాన్యులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే, గతంలోనూ అనేకసార్లు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశమైంది. అలా ఎప్పుడు ప్రత్యేక సమావేశాలు జరిగాయో చూద్దాం..