ఆదిలాబాద్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన కుటుంబం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు కారులో తిరిగివస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుడిహత్నూర మండలం మేకలగండి వద్ద కారు డివైడర్‌ను ఢీకొట్టింది. అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రిమ్స్ దవాఖానకు తరలించారు. మృతులను షేక్ మొయినుద్దీన్ (65) మొయినుద్దీన్( 40) ఉస్మానుద్దీన్ (12) ,మొహమ్మద్ (5)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.