హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 12(నమస్తే తెలంగాణ): ఎరువులు, మందుల తయారీలో కీలకమైన హైడ్రాజీన్ హైడ్రేట్ తొలి ప్రొడక్ట్ విడుదలైంది. దీని ఉత్పత్తికి కావాల్సిన సాంకేతికతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. గుజరాత్ దహేజ్‌లోని ప్రత్యేక ప్లాంట్‌లో తయారుచేసిన ఈ ప్రొడక్ట్‌ను గుజరాత్ ఆల్కలీస్ అండ్ కెమికల్స్ లిమిటెడ్‌కు అందజేయగా, బుధవారం ఆవిష్కరించారు. ఐఐసీటీకి చెందిన 15 మంది శాస్త్రవేత్తలు శ్రమించి ఈ ప్రొడక్ట్ సాంకేతికతకు రూపకల్పన చేశారు.