హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది దీపావళికి అత్యధికంగా 8,019 పటాకుల దుకాణాలకు లైసెన్స్లు ఇచ్చామని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్సింగ్మాన్ స్పష్టంచేశారు. 2023లో 6439, 2024లో 7516 షాపులకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా 2023లో 164 ప్రమాదాలు, 2024లో 95 ప్రమాదాలు చోటుచేసుకున్నట్టు వెల్లడించారు. ఏదైనా అగ్నిప్రమాదం సంభవిస్తే తక్షణం 101, 112, లేదా 9949991101 నంబర్లకు ఫోన్ చేయాలని ఆయన కోరారు. లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే నాణ్యమైన పటాకులు కొనుగోలు చేయాలని సూచించారు. టపాకులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరారు.