పొగరాయుళ్లతోనే అగ్ని ప్రమాదాలు!

- రెండేండ్లలో 8,855 ప్రమాద ఘటనలు
- 174 మందిని కాపాడిన ఫైర్ సిబ్బంది
- రూ.1,730 కోట్ల ఆస్తినష్టం తగ్గింపు
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): కొందరి నిర్లక్ష్యం అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నది. కొన్ని ప్రాణాలను దహించి, కోట్ల రూపాయల ఆస్తిని బుగ్గిచేస్తున్నది. గడిచిన రెండేండ్ల (2019, 2020)లో రాష్ట్రవ్యాప్తంగా 8,855 అగ్నిప్రమాదాలు సంభవించాయి. పొగరాయుళ్లు సిగరెట్, బీడీ తాగిన తర్వాత పీకలను నిర్లక్ష్యంగా నిప్పు ఆర్పకుండా పారవేయడమేనని ఈ ప్రమాదాలకు కారణమని తేలినట్టు రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ వెల్లడించింది. బుధవారం నుంచి అగ్నిమాపకశాఖ వారోత్సవాలు మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో అగ్ని ప్రమాదాలు, కారణాలు తదితర అంశాలను ఆ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రెండేండ్లలో 174 మంది ప్రాణాలను అగ్నిప్రమాదాల నుంచి కాపాడినట్టు అధికారులు తెలిపారు. రెండేండ్లలో 16,859 ఫైర్‌కాల్స్ వచ్చాయని, వాటిలో తీవ్రమైన అగ్నిప్రమాదాలు 207 వరకు ఉన్నాయని పేర్కొన్నారు. స్వల్ప అగ్నిప్రమాదాలు 15,345, మీడియం ప్రమాదాలు 433, రెస్క్యూకాల్స్ 874 వరకు ఉన్నట్టు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పాట్‌కు చేరడం, చాకచక్యంగా వ్యవహరించడంతో 2019లో రూ.770.468 కోట్లు, 2020లో రూ.959.85 కోట్ల మేర ఆస్తినష్టాన్ని నివారించినట్టు వివరించారు. ఎలక్ట్రికల్ పరికరాల కారణంగా రెండేండ్లలో 4,718 ప్రమాదాలు జరిగాయని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
Ranabaali | ‘రణబాలి’ రికార్డుల మోత.. బతుకమ్మ వేడుకల్లో సందడి చేసిన విరోష్ జోడీ!
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

