సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 01, 2021 , 02:31:50

పైలెట్‌ కల సాకారానికి సాయం

పైలెట్‌ కల సాకారానికి సాయం

  • శిక్షణకు ఎంపికైన విద్యార్థినికి ఆర్థిక సాయం 
  • రూ.1.30 లక్షలు అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌  

చొప్పదండి, డిసెంబర్‌ 31: తెలంగాణ ఏవియేషన్‌ అకాడమీలో కమర్షియల్‌ పైలెట్‌ ట్రైనింగ్‌కు ఎంపికైన ఓ విద్యార్థినికి చొప్పదండి ఎమ్మెల్యే సుం కె రవిశంకర్‌ ఆర్థిక సాయం చేశారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలంలోని మంగళపల్లికి చెందిన పెద్దెల్లి ఆపేక్ష ఏవియేషన్‌ అకాడమీలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణకు ఎంపికైంది. శిక్షణలో చేరేందుకు రూ.2.50 లక్షలు చెల్లించాలి.  పేద కుటుంబానికి చెందిన ఆమె పరిస్థితి తెలుసుకున్న ఎమ్మెల్యే  గురువారం ఆమెకు రూ.1.30 లక్షలు సాయం అందజేశారు.  


logo