e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home టాప్ స్టోరీస్ డబ్బులు కట్టినా వ్యాక్సిన్‌ ఇవ్వట్లేదు

డబ్బులు కట్టినా వ్యాక్సిన్‌ ఇవ్వట్లేదు

  • కేంద్రం తీరుపై ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం
  • లాక్‌డౌన్‌తో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం
డబ్బులు కట్టినా వ్యాక్సిన్‌ ఇవ్వట్లేదు

సంగారెడ్డి, మే 22 (నమస్తే తెలంగాణ)/జహీరాబాద్‌: కేంద్రానికి రూ.100 కోట్లు చెల్లించినా కరోనా వ్యాక్సిన్లు సరఫరా చేయట్లేదని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ సమీపంలోని హుగ్గెళ్లి కల్వరి టెంపుల్‌లో ఏర్పాటుచేసిన వంద పడకల ఐసొలేషన్‌ కేం ద్రాన్ని శనివారం మంత్రి ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభు త్వం కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ల కోసం కేంద్రానికి రూ.100 కోట్లు చెల్లించినా, ఇప్పటికీ సరఫరా చేయట్లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్ల ద్వారా వ్యాక్సిన్లు సమకూర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. లాక్‌డౌన్‌ తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని స్పష్టంచేశారు. సంగారెడ్డికి మంజూరైన మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీలను ఈ విద్యా సంవత్సరంలోనే ప్రా రంభించేందుకు చర్యలు తీసుకుంటున్న ట్టు వెల్లడించారు. కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసే ప్రైవేటు దవాఖానల లైసెన్స్‌ రద్దు చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి, అమెజాన్‌ ప్యాపిరస్‌ కెమికల్‌ కంపెనీ యాజమాన్యం అందజేసిన మూడు అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీరెడ్డి, ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్సీభూపాల్‌రెడ్డి, కలెక్టర్‌ హన్మంతరావు, ఎమ్మె ల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్‌ పాల్గొన్నారు. కల్వరి టెంపుల్‌లో 100 పడకల ఐసొలేషన్‌ కేంద్రం ఏర్పాటు చేయటంపై నిర్వాహకుడు సతీశ్‌ను అభినందించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
డబ్బులు కట్టినా వ్యాక్సిన్‌ ఇవ్వట్లేదు

ట్రెండింగ్‌

Advertisement