హైదరాబాద్, జూలై 16(నమస్తే తెలంగాణ): వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీని వేగవంతం చేయాలని తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్(టీజీడీఏ) కోరింది. ఖాళీగా ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా మార్చాలని విజ్ఞప్తిచేసింది.
ఈ మేరకు టీజీడీఏ అధ్యక్షుడు పీ నరేందర్రెడ్డి, ఉపాధ్యక్షుడు బొల్లం తిరుపతి, పీ రమణారావు, మహేందర్ తదితరులు బుధవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణాకు వినతిపత్రం సమర్పించారు.