హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశించారు. శనివారం ఆయన బీఆర్కేభవన్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. బోధన, జిల్లా దవాఖానల్లో పీడియాట్రిక్ ఆక్సిజన్, ఐసీయూ పడకలను పెంచాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోని వారిని గుర్తించి, వ్యాక్సిన్లు వేసేందుకు మాప్ అప్ డ్రైవ్ నిర్వహించాలని సూచించారు.
ఆర్ఐడీఎఫ్ పనులను పూర్తి చేయండి
గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి(ఆర్ఐడీఎఫ్) ద్వారా రాష్ట్రంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆదేశించారు. శనివారం బీఆర్కేభవన్లో నీటిపారుదల, మిషన్ భగీరథ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ మొదలైన శాఖలు చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.రాష్ట్రంలో ఇంటెన్సివ్ ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించడానికి సులభంగా ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశాలను అన్వేషించాలని వ్యవసాయశాఖ కార్యదర్శిని కోరారు. ఆయా సమావేశాల్లో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.