ACB Raid | రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన మహిళా ఎస్సై, రైటర్
ACB Raid | సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై, రైటర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
హైదరాబాద్ : సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ మహిళా ఎస్సై, రైటర్ లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు పట్టుబడ్డారు. ప్రేమ వివాహం చేసుకుని, తన తల్లిదండ్రులు ఒప్పుకోవడంలేదని సహాయం కోసం అభిషేక్ అనే యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.
అయితే తల్లిదండ్రులతో మాట్లాడుకోవాలని పోలీస్ స్టేషన్‌కు రావాలని ఎస్సై నందిత పిలిచి డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో డబ్బులు ఇచ్చేందుకు అభిషేక్ నిరాకరిం చడంతో, తండ్రిని కొట్టాడని అభిషేక్‌పై కేసు నమోదు చేసి జైలు ( Jail ) కు పంపారు.
జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాక ప్రతీ సోమవారం సంతకం చేసేందుకు స్టేషన్‌కు వస్తున్న అభిషేక్‌ను రైటర్ విజయ్ రూ.10 వేలు , ఎస్సై నందిత రూ.30 వేలు డిమాండ్ చేశారు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు.
ఏసీబీ అధికారుల సూచనలతో లంచం ఇచ్చేందుకు బాధితుడు రాగా అతడికి తన స్కూటీ తాళం ఇచ్చి డిక్కీలో డబ్బులు పెట్టమని ఎస్సై సూచించారు. బాధితుడు స్కూటీలో డబ్బులు పెట్టగానే, ఎస్సై నందితను, రైటర్ విజయ్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

