ప్రవేశ పరీక్షలకు కరెంట్ కోతల భయం
రాష్ట్రంలో పలు కోర్సుల ప్రవేశపరీక్షలకు కరెంట్ కోతల భయం పట్టుకున్నది. ఎల్సీ, మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. మే నుంచి రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల సీజన్ ప్రారంభం కానున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పలు కోర్సుల ప్రవేశపరీక్షలకు కరెంట్ కోతల భయం పట్టుకున్నది. ఎల్సీ, మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్తు కోతలు విధిస్తున్నారు. మే నుంచి రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల సీజన్ ప్రారంభం కానున్నది. మే 6న టీఎస్ఈసెట్, మే 7 నుంచి 11 వరకు ఎప్సెట్, మే 23న ఎడ్సెట్, జూన్ 3న లాసెట్, పీజీలాసెట్, జూన్ 5, 6 తేదీల్లో ఐసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కరెంట్ కోతలు ఉండొద్దని విద్యుత్తుశాఖకు విద్యాశాఖ లేఖలు రాసింది. మరోవైపు, అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర సమయంలో యూపీఎస్లను వినియోగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కువసేపు కరెంట్పోతే ఇబ్బందులు ఎదురుకాకుండా జనరేటర్లను పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. జనరేటర్లు, యూపీఎస్లు ఉండే సెంటర్లకే పరీక్ష కేంద్రాలుగా అనుమతిస్తున్నారు. మరోవైపు, పరీక్షల నిర్వహణకు సహకరించాలని పోలీస్ శాఖకు, వీలైనన్నీ ఎక్కువ బస్సులు నడపాలని ఆర్టీసీకి విద్యాశాఖ లేఖ రాసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

