ఖమ్మం : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తిపాస్తుల ముందు మానవ సంబంధాలు మంటగలిచాయి. కన్నపేగుకన్న ఆస్తే( property) మిన్న అనుకున్న ఆ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. ఆస్తి కోసం కన్నబిడ్డనే కడతేర్చాడు ఆ కసాయి తండ్రి (Father killed ). వివరాల్లోకి వెళ్తే..వైరా మండలం తాటిపూడి గ్రామంలో భూమి వివాదాలు, ఆస్తుల విషయంలో పిట్టల రాములు అనే వ్యక్తికూతురు ఉష, అల్లుడు కృష్ణపై దాడి చేశాడు. కూతురు మరణించగా అల్లుడు కృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు అంబులెన్స్‌లో దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.