నిర్మల్: నిర్మల్ జిల్లా (Nirmal) నీలాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున నీలాయిపేట వద్ద డీసీఎం, కారు ఢీకొన్నాయి. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతోపాటు వెనుక టైర్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న తండ్రీ కూతురు అశోక్ (45), కృతిక (20) అక్కడికక్కడే మృతిచెందారు.
కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రుని దవాఖానకు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.