హైదరాబాద్ : ఆరోగ్య శ్రీ నిధుల విడుదలలో ఆలస్యం లేదు. ఇంకా తొందరగా నిధులు విడుదల అయ్యేటట్లు చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ దవాఖానలో మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ వారి సహకారంతో నిర్మించిన ఐసీయూ భవనం, నూతన ఆపరేషన్ థియేటర్స్‌ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..దుర్గాబాయి దేశ్ ముఖ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మహిళల విద్య కోసం ఆమె ఎంతో కృషి చేసారని అన్నారు.దుర్గాబాయి దేశముఖ్ ఆశయాలను అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలన్నారు. ఆరు నెలల క్రితం ఆక్సిజన్ దొరుకక ఇబ్బంది పడ్డప్పుడు మేఘ కృష్ణా రెడ్డికి చెప్తే క్రయోజెనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లను పంపించారు.
ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నామన్నారు. దుర్గాబాయి దేశ్ ముఖ్ దవాఖానకు ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరఫు నుంచి అందిస్తామన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందిచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.