శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 24, 2020 , 00:47:36

సారు మాట.. సాగు బాట

సారు మాట.. సాగు బాట

  • నియంత్రిత సేద్యానికి అన్నదాతల మద్దతు 
  • గ్రామాల్లో కొనసాగుతున్న తీర్మానాలు 
  • చెప్పిన పంట వేస్తామని రైతుల ప్రతిజ్ఞ

ధర్మారం/కొణిజర్ల: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు తాము నియంత్రిత సేద్యమే చేస్తామంటూ పలుజిల్లాల రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. సీఎం చెప్పినట్లు సాగు చేస్తామంటూ శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని నర్సింహులపల్లి, కానంపల్లి, బుచ్చయ్యపల్లి గ్రామాల రైతులు  ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో నర్సింహులపల్లిలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట మూడు గ్రామాల రైతులు ప్రతినబూనారు. ఖమ్మం జిల్లా కొణిజర్లలో ప్రభుత్వ సూచనల మేరకే పంటసాగు చేపడతామని రైతులంతా సమిష్టిగా తీర్మానంచేశారు. 


logo