సర్కార్‌ను నమ్మి మోసపోయినం.. గుంజీలు తీసి జొన్న రైతుల నిరసన
జొన్నలు కొనుగోలు చేస్తదని కాంగ్రెస్ సర్కార్‌ను నమ్మి మోసపోయినం.. జొన్నలు సాగు చేసి తప్పు చేశామంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు మోకాళ్లపై కూర్చొని గుంజీలు తీసి నిరసన తెలిపారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, మే 15: జొన్నలు కొనుగోలు చేస్తదని కాంగ్రెస్ సర్కార్‌ను నమ్మి మోసపోయినం.. జొన్నలు సాగు చేసి తప్పు చేశామంటూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు మోకాళ్లపై కూర్చొని గుంజీలు తీసి నిరసన తెలిపారు. పంట కోసి నెల రోజులైనదని, నామ్కేవాస్తేగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినదని, కానీ కొనుగోళ్లు చేపట్టడం లేదని అన్నారు. అధికారులను అడిగితే మకలు కొంటున్నం, జొన్న కొనుగోలుకు ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జొన్నలు కొనాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు ఎదుట రైతులు బోథ్-నిర్మల్ రహదారిపై బైఠాయించారు. జొన్నలు తెచ్చి వారమైనా కొనడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐ పురుషోత్తం, కేంద్రం ఇన్చార్జి బారే భూషణ్ వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ వెనుకాల రైల్వే ఓవర్‌బ్రిడ్జి పక్కన బారులు తీరిన మక్కల లోడ్‌తో వచ్చిన ట్రాక్టర్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

