Minister Indrakaran Reddy | మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నామినేషన్ ఖర్చులకు రైతుల విరాళం
Minister Indrakaran Reddy | నిర్మల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy)కి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నది. తాజాగా పాక్పట్ల, గాంధీనగర్, పోచంపహాడ్, మాదాపూర్ గ్రామాల రైతులు మద్దతుగా నిలిచారు. రెండు లక్షల పదహారు రూపాయాల విరాళం చెక్కును మంత్రికి అందజేశారు. పాక్పట్లలో ఆయిల్ఫామ్ ప్యాక్టరీ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా నామినేషన్ ఖర్చు కోసం ఈ చెక్కును అందజేసినట్లు రైతులు తెలిపారు.
నిర్మల్, అక్టోబర్ 31: నిర్మల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి(Minister Indrakaran Reddy)కి అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నది. తాజాగా పాక్పట్ల, గాంధీనగర్, పోచంపహాడ్, మాదాపూర్ గ్రామాల రైతులు మద్దతుగా నిలిచారు. రెండు లక్షల పదహారు రూపాయాల విరాళం చెక్కును మంత్రికి అందజేశారు. పాక్పట్లలో ఆయిల్ఫామ్ ప్యాక్టరీ(Oilfarm Factory) ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా నామినేషన్ ఖర్చు కోసం ఈ చెక్కును అందజేసినట్లు రైతులు తెలిపారు. విరాళం ఇచ్చిన రైతులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో రైతు గోసలు పోయాయని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, పుష్కలంగా సాగు నీరు అందించి రైతును రాజుగా చేసిన బీఆర్ఎస్ కు అండగా నిలవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల గురించి పట్టించుకున్న వారు లేరని, వారికి రైతు సంక్షేమం పట్టదన్నారు.
కర్నాటకలో కేవలం 5 గంటల కరెంట్ ఇస్తూ..రైతులకు ఎదో చేశామని కర్నాటక ఉప ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ పాలిత మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి ఉందని వివరించారు. కేసీఆర్ భరోసా పేరుతో రైతుబంధు, ఆసరా పింఛన్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను కోనసాగిస్తామని చెప్పారు. ఎన్నికలు కాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

