ఖమ్మం వ్యవసాయం : పత్తికి మద్దతు ధర ఇవ్వాలని సీపీఐ, రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డుకు తాళం వేసి మంగళవారం ధర్నా చేస్తున్న రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు హేమంతరావు,సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకుడు అవునూరి మధు.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది పత్తి దిగుబడి ఆశాజనకంగా ఉంది. వాతావరణం అనుకూలించడం, వర్షాలు సహకరించడంతో ఎకరాకు 10 క్వింటాళ్లకుపైగా దిగుబడి వచ్చింది. పత్తి చేలు దూదితో కళకళలాడుతున్నాయి. మావల మండలంలోని బట్టి సావర్గాం సమీపంలోని చేనులో విరగబూసిన పత్తిని ‘నమస్తే’ క్లిక్ అనిపించింది.
– ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్
నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం నీలంనగర్ వద్ద కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారిపై పత్తి కొనుగోలు చేయాలని ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి ఆందోళన చేస్తున్న రైతులు.
– పెద్దఅడిశర్లపల్లి