మహబూబాబాద్ రూరల్, ఆగస్టు 13 : రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నోసార్లు చెప్పారని కానీ ఇప్పటివరకు చేయలేదని మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ పోరిక బలరాంనాయక్ అన్నారు. రుణమాఫీలో రైతుకు ద్రోహం జరిగిందని ఆయన అంగీకరించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. సొంత పార్టీ నాయకుడే ముఖ్యమంత్రిపై ఇలా వ్యాఖ్యలు చేయడమేమిటంటూ వేదికపైన ఉన్న ఎమ్మెల్యే మురళీనాయక్తోపాటు జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ నాయకులు , కార్యకర్తలు, ప్రజలు ఒక్కసారిగా కంగుతిన్నారు.