సిరిసిల్లరూరల్/ఎలిగేడు: పిడుగు పడుతుందనే భయంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన గీత కార్మికుడు బండి శేఖర్‌గౌడ్ (52) తాటి చెట్టుపై నుంచి పడి మృతిచెందాడు. శేఖర్ తాటి చెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా భారీ శబ్దాలతో పిడుగులు పడుతుండ టంతో భయాందోళనకులోనై, జారిపడ్డాడు. అక్కడే ఉన్న గీతకార్మికులు శేఖర్‌ను దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్టలో పిడుగు పడి కాసోజుల మణికంఠ (25) మృతిచెందాడు.