తాడూరు, జూలై 20 : నకిలీ డీఏపీ పట్టుబడిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం ఆకునెల్లికుదురులో నకిలీ డీఏపీ విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు సోమవారం మండల వ్యవసాయ అధికారి సందీప్‌కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. గ్రామంలోని ఓ వ్యక్తి అనుమతి లేని నకిలీ డీఏపీని అమ్ముతుండగా.. 80 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 10 మంది రైతులకు అమ్మిన నకిలీ విత్తనాలను, 14 ఖాళీ బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. అమ్మిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఏవో సందీప్‌కుమార్ తెలిపారు.