R.Krishnaiah | నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు తీరని అన్యాయం : ఆర్ కృష్ణయ్య
R.Krishnaiah | బీసీల డిమాండ్లు పరిష్కరించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R.Krishnaiah) కోరారు.
ముషీరాబాద్ : బీసీల డిమాండ్లు పరిష్కరించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య (R.Krishnaiah) కోరారు. జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బీసీ జోడో యాత్రలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు పది సీట్లు ఇవ్వాలని, బీసీ(BC) డిమాండ్లపై విధానపరమైన ప్రకటన చేసి తమ మేనిఫెస్టోల (Manifestos) లో చేర్చాలని అన్నారు.
15 లక్షల ఉద్యోగాల భర్తీకి సానుకూలంగా ఉన్న పార్టీలకే మద్దతు ఇస్తామని, బీసీలకు టికెట్లు ఇచ్చిన పార్టీలకే ఎన్నికల్లో అండగా నిలుస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు తీరని అన్యాయం చేసిందని, సంపన్న వర్గాలకు పెద్ద పీఠవేసిందని మండిపడ్డారు. ఫీజు బకాయిలు, ఉపకార వేతనాల చెల్లింపులో రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, పేద, బలహీన వర్గాల విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రలు పన్నుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బీసీల అభివృద్దికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించడానికి మనసు రావడం లేదని, ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తూ తీరని ద్రోహం చేస్తుందని విమర్శించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని, 50 శాతం ఎంపీ స్థానాలు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్‌కుమార్, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, నందగోపాల్, రాజ్‌కుమార్, అంజి, ప్రవీణ్‌ముదిరాజ్, ఉదయ్, రోహిత్, నాగరాజు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
చెకుముకి సైన్స్ సంబురాలు-2026 పోస్టర్ ఆవిష్కరణ
Narnoor | గోవర్ధన్ గుట్టపై ఆదివాసుల సాంప్రదాయ పూజలు
Women Professor | వీసీ అల్డాస్ జానయ్య వేధింపులకు మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి.. వీడియో
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

