Graduate MLC Elections | హైదరాబాద్ : రాష్ట్రంలో కరీంనగర్ – ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ గ్రాడ్యుయేట్ నియోజక వర్గంలో గ్రాడ్యుయేట్ల ఓటర్ నమోదు ప్రక్రియ ఈ నెల 6తో ముగియనుంది. అయితే ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్లలో చాలా మంది తమ ఓటును నమోదు చేసుకోలేదు. కేవలం 2,61,000 మాత్రమే నమోదైనట్లు ఆ నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి పురుషోత్తం చాట్లపల్లి తెలంగాణ సీఈవో దృష్టికి తెచ్చారు. ఈ మేరకు ఓటరు నమోదుకు గడువు తేదీ పొడిగించాలని కోరుతూ మంగళవారం సీఈవో సుదర్శన్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు సీఈవో సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.