KCR Tour | రేవంత్‌కు పాలనపై సోయి లేదు : మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
KCR Tour | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలనపై సోయి లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ఆదివారం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు.
KCR Tour | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పాలనపై సోయి లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, ఎంపీ అభ్యర్థి కృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ ఆదివారం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు. ఉదయం 9గంటలకు బయలుదేరి భువనగిరి మీదుగా జనగామ వెళ్తారన్నారు. మొదట దేవరప్పులలో ఎండిన పంటలను పరిశీలిస్తారని చెప్పారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి, తుంగతుర్తి మండలాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారన్నారు. అనంతరం సూర్యాపేట పట్టణంలోని జనగామ రోడ్‌లోని పంటలను పరిశీలిస్తారన్నారు.
సూర్యాపేటలో ప్రెస్‌మీట్ నిర్వహిస్తారన్నారు. అక్కడి నుంచి హాలియా, మిర్యాలగూడ రోడ్ పక్కన ఉన్న సాగర్ ఆయకట్టులో ఎండిన పొలాలను పరిశీలించి.. హైదరాబాద్‌కు బయలుదేరుతారన్నారు. ఆరోగ్యం బాగా లేకున్నా రైతుల కష్టాలు చూడలేక కేసీఆర్ ఆదివారం అన్నదాతల వద్దకు వస్తున్నారన్నారు. రేవంత్‌కి పరిపాలనపై సోయిలేదని.. ఇప్పటివరకు వ్యవసాయంపై సమీక్ష లేదని.. మంత్రి కూడా సమీక్ష చేయలేదరన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ ఉంటే భూమి ఆకాశo ఒక్కటి చేసైనా సరే అన్నదాతలకు నీళ్లు అందించేవారన్నారు.
కానీ, ఇవాళ దరిద్రమైన ప్రభుత్వం ఉన్నదన్నారు. రాష్ట్రంలో నీళ్లు అందక లక్షల ఎకరాలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు మోర పెట్టుకున్నా ప్రభుత్వంలో కదలిక లేదన్నారు.
నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వలేదని.. ప్రభుత్వం నిర్లక్ష్యంతో అన్నదాతలు ఆగం అయ్యారన్నారు.
కేసీఆర్‌పై కోపంతో రైతులను బలి పెట్టారు కాంగ్రెస్ వాళ్లు.. సాగర్‌లో డెడ్ స్టోరేజ్ నీళ్లు ఉన్నా అప్పుడు నీళ్లు అందించామన్నారు. అన్నదాతలను కాపాడుకున్నామని.. కానీ, ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడని.. ఎస్సారెస్పీ కింద సూర్యాపేట జిల్లాలో నీళ్లు ఇస్తామన్నారు. పంటలు సాగు చేయండని చెప్పి మరి ప్రభుత్వం మోసం చేసిందన్నారు.
నీళ్లు ఇవ్వక ఎక్కడికక్కడ ఎండిపోయాయన్నారు. జిల్లా మంత్రులు అక్రమ వసూళ్లు, దందాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. మిల్లర్లను బెదిరింపు చేసి కోట్లు వసూలు చేశారని.. మిల్లర్లు ఏమో అన్నదాతలను పీక్కోని తింటున్నరని విమర్శించారు. కోమటిరెడ్డి ఓ బడ్డారఖాన్.. ఓ జోకర్.. ఆయన మాటలకు ఎక్కడ విలువ లేదన్నారు. ఎంపీ లింగయ్య యాదవ్ రేవంత్ రెడ్డి సీఎం ఉడడం లేదన్నారు. దౌర్భాగ్యం జిల్లాలో నష్టపోయిన రైతులకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం మెడలు వంచుతామన్నారు. కేసీఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారని, రైతుల అండగా ఉంటారన్నారు. పరిపాలన చేతకాక రేవంత్ అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ నయవంచనను అర్థం చేసుకోవాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాచిరాజుగూడెంలో కోడి పందాలపై పోలీసుల రైడ్
AP Rains | బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి.. ఏపీలో నాలుగురోజులు వర్షాలు..!
Sampath Nandi | పవన్ కల్యాణ్‌తో సినిమా చేయని సంపత్ నంది.. కారణం ఏంటో తెలుసా..?
Karthika Pournami | వేయిస్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి శోభ.. దర్శనానికి బారులు తీరిన భక్తులు
Vidadala Rajini | ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం : వైసీపీ మాజీ మంత్రి రజిని
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

