Harish Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ కీలక నేత హరీష్‌రావు విచారణ ముగిసింది. జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులు దాదాపు ఏడుగంటలకుపైగా ఆయనను విచారించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విచారణ కొనసాగింది. దీనిపై హరీష్‌రావు మరికాసేపట్లో తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని శనివారం సాయంత్రం సిట్ అధికారులు హరీష్‌రావుకు నోటీసులు పంపించడంతో ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. అప్పటి నుంచి సాయంత్రం 6.30 గంటలకు వరకు అధికారులు ఆయనను ప్రశ్నించారు.
అయితే విచారణ సందర్భంగా న్యాయవాదులను లోపలికి అనుమతించలేదు. దాంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దాంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సిట్ అధికారులైన ఏసీపీ వెంకటగిరి, ఎస్పీ రవీందర్‌రెడ్డి ఆయనను విచారించారు.