హైదరాబాద్, ఫిబ్రవరి14 (నమస్తే తెలంగాణ) : ఏడాదిగా అనేక మంది గీత వృత్తిదారులు ప్రమాదవశాత్తు తాటిచెట్ల పైనుంచి పడి మృతిచెందారని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఎక్స్గ్రేషియా చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, దీంతో కులవృత్తి జీవనాధారంగా బతుకులు వెల్లదీస్తున్న బాధిత గౌడ కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తంచేసింది. ప్రమాదాల నివారణకు గీత వృత్తిదారులకు సేఫ్టీ మోకులు అందించాలని సంఘం కోరింది.