హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్రం నిర్ణయించిన విధివిధానాలు, కోటాల మేరకే పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తామని ప్రకటించడం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతాంగాన్ని తీవ్ర నిరాశకు గురిచేసేదిగా ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.