హైదరాబాద్, మే 26(నమస్తేతెలంగాణ) : విద్యాప్రమాణాల పెంపు కోసం మండల విద్యాధికారులంతా పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మ కం పెరిగేలా ఎంఈవోలు పనిచేయాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 304 మండలాల ఎంఈవోలకు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్చార్డీలో నిర్వహించారు. బడిబాట కార్యక్రమంలో ప్రతి ఎంఈవో యాక్షన్‌ప్లాన్‌ను రూపొందించి విద్యార్థుల సంఖ్యను పెంచేలా కృషిచేయాలని కోరారు.