హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెలో ఆర్టీసీ కార్మికులంతా పాల్గొనాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, ఈదురు వెంకన్న ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికవర్గ హకులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయడం, కార్మికుల శ్రమదోపిడీని అరికట్టడం, లేబర్ యాక్ట్ అమలు వంటి ప్రధాన డిమాండ్లను సాధించుకునేందుకు తలపెట్టిన సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, యూనియన్లు పాల్గొనాలని కోరారు.