హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ బీఆర్కే భవన్కు చేరుకున్న ఆయనకు మద్దతుగా పెద్ద సంఖ్యలో అభిమానులు, బీజేపీ కార్యకర్తలు తరలివచ్చారు. జస్టీ స్ పీసీ ఘోష్ ఆయనను విచారిస్తున్నారు.
ఇప్పటికే అన్ని దశల్లో విచారణ పూర్తిచేసిన కమిషన్.. ప్రస్తుతం రాజకీయ ప్రముఖులను విచారించేందుకు సిద్ధమైంది. నాడు ఆర్థికశాఖ మంత్రిగా ఈటల కొనసాగిన సమయంలో బరాజ్లపై నిర్మాణం చేపట్టారు.