హైదరాబాద్ : గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌కు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఆమెను మంత్రుల నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ..సత్యవతి రాథోడ్ జీవితాంతం ఆయురారోగ్యాలతో ఉండాలని, ఎక్కువ కాలం ప్రజా సేవలో ఉండాలని కోరుకున్నారు. అలాగే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా మంత్రి సత్యవతికి శుభాకాంక్షలు తెలిపారు. సత్యవతి రాథోడ్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఎంపీ ఆకాంక్షించారు.