కేశంపేట, డిసెంబర్ 24: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం మంగళగూడెంలో లేగదూడలపై చిరుత పంజా విసురుతున్నది. వారం రోజులుగా గ్రామంలోని లేగదూడలు, దుడ్డెలను వరుసగా హతమారుస్తుండటంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు. గురువారం రాత్రి రెండు లేగదూడలపై దాడి చేసి చంపేసింది. ఈ వారం రోజుల్లోనే గ్రామానికి చెందిన ఏడుగురు రైతులకు చెందిన పది లేగదూడలను చిరుత హతమార్చిందని స్థానికులు తెలిపారు. పాద ముద్రలను పరిశీలించిన అటవీ అధికారులు.. చిరుతను రెండు రోజుల్లో పట్టుకుంటామని తెలిపారు.