ఒకేరోజు 5వేల మొక్కలు

- దండుమల్కాపురంలో గ్రీన్ చాలెంజ్
- మొక్క నాటిన ఎంపీ సంతోష్‌కుమార్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ)/చౌటుప్పల్ రూరల్: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో మరో ముందడుగు పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలోని గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో ఒక్కరోజే 5 వేల మొక్కలు నాటారు. గురువారం గ్రీన్ ఇండియా చాలెంజ్తోపాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్‌కు చెందిన ఎన్వై ఫౌండేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సీఎం కేసీఆర్ చేపట్టిన తెలంగాణకు హరితహారం స్ఫూర్తితోనే గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రారంభించామని ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులో అజయ్ దేవగన్‌తో కలిసి సంతోష్‌కుమార్ మొక్కలు నాటారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు.
ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎంతో మంది సెలబ్రిటీలు, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఈ చాలెంజ్‌లో పాల్గొంటున్నారని గుర్తుచేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇతర రాష్ర్టాల్లో కూడా గ్రీన్ చాలెంజ్‌ను ముందుకు తీసుకుపోవడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అజయ్ దేవగన్ మాట్లాడుతూ.. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే సమీప భవిష్యత్‌లో మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. అభివృద్ధి ఎంత అవసరమో.. పర్యావరణ సమతుల్యతను కాపాడటం అంతే అవసరమని గుర్తించి తన శక్తి మేరకు ఎన్వై ఫౌండేషన్స్ స్థాపించి మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించినట్టు వెల్లడించారు.
పచ్చదనాన్ని పెంచాలనే లక్ష్యంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపంలో నిస్వార్థంగా పనిచేస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్‌ను, ఆయన బృందాన్ని చూస్తే తనకు గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పరిశ్రమల ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, వందలాది మంది పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- జిల్లా డైరెక్టర్ తో రామ్ నెక్ట్స్ మూవీ..!
- ఇద్దరు మావోయిస్టు కొరియర్ల అరెస్ట్
- ఫిబ్రవరి 18న ఐపీఎల్ వేలం!
- ఆ బుల్లెట్ ఎవరిదో తెలిసిపోయింది..!
- సీబీఐ, ఈడీ స్వతంత్రంగా లేకుంటే ప్రజాస్వామ్యానికే తీరని ముప్పు!
- యజమాని కోసం ఆసుపత్రి వద్ద కుక్క నిరీక్షణ
- ఈ రంగాల్లో కొలువుల కోతకు బ్రేక్!
- నయనతార కోసం చిరు వెయిటింగ్..!
- 24న తెలంగాణ తాసిల్దార్ల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
- టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు