హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలన్న లక్ష్యంతో పరిశ్రమలు తమ విధానాలను మార్చుకుంటున్నాయని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) కే మోహన్‌రెడ్డి తెలిపారు. ఇకపై ఏ ఖనిజ పరిశ్రమ అయినా రెండు వంతులు అభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంటే పర్యావరణానికి మూడు వంతులు మేలు చేసే చర్యలు చేపట్టాల్సి ఉంటు ందని, ఈ మేరకు తాము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీర్స్ (ఐఐఐఈ) హైదరాబాద్ చాప్టర్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే తాము సౌర విద్యుత్తును ఉత్పత్తిచేస్తున్నామని, పవన విద్యుత్తు రంగంలోకీ అడుగు పెట్టామని వివరించారు.