హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంపునకు ఏటా నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. కార్యక్రమ షెడ్యూల్, మార్గదర్శకాలను శనివారం విడుదల చేశారు.
జూన్ 6న గ్రామసభ, 7 నుంచి 9 వరకు కరపత్రాలు, బ్రోచర్లతో ఇంటింటి ప్రచారం, 10న పాఠశాలల పరిశుభ్రం, 12న పేరెంట్ టీచర్ మీటింగ్, 13న సామూహిక అక్షరాభ్యాసం, 19న స్పోర్ట్స్ డే నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం విజయవంతానికి కలెక్టర్లు చొరవ తీసుకోవాలని కోరారు. ఈ నెల 31లోగా యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.