హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 17 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ హబ్, సుజుకి ఇనిషియేటివ్ నెక్ట్స్ సంస్థలు భారత్ వెంచర్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. బుధవారం టీహబ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఈవో ఎంఎస్రావుతోపాటు నెక్ట్స్ భారత్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో విపుల్నాథ్, సుజుకి మోటర్ కార్పొరేషన్ రోనిత్కుమార్ ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. టీ హబ్ సీఈవో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి నెక్ట్స్ భారత్ వెంచర్ ముందుకు వచ్చిందని చెప్పారు. ఎంపిక చేసిన ఆవిష్కరణలకు రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు పెట్టుబడులు సమకూరుస్తామని తెలిపారు.