గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:56:22

మినీ డెయిరీలతో దళితులకు ఉపాధి

మినీ డెయిరీలతో దళితులకు ఉపాధి

  • ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ 

హైదరాబాద్‌, జనవరి 12 (నమస్తే తెలంగాణ): స్వయం ఉపాధి అవకాశాల ద్వారా దళితుల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ కృషి చేస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు.  మినీ డెయిరీ పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పది జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా బర్రెలు అందించి స్వయంసమృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. లబ్ధిదారుల ఎంపిక, సొసైటీల ఏర్పాటును వేగవంతం చేయాలని పేర్కొన్నారు.  

మినీ డెయిరీల ఏర్పాటుకు 60 శాతం సబ్సిడీ 

మినీ డెయిరీల ఏర్పాటు కోసం నిరుపేద దళితులకు ఈ పథకం కింద నాలుగు బర్రెలను అందిస్తారు. మొదటి దశలో రెండు, తర్వాత దశలో రెండు బర్రెలను అందిస్తారు. ఇందు కోసం ఒక్కో యూనిట్‌కు నాలుగు లక్షలు ఇస్తారు. అందులో 60 శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంకుల ద్వారా రుణంగా ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3,441 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం యూనిట్లకు సంబంధించిన 60 శాతం సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేశారు.


logo