వైరాటౌన్, ఆగస్టు 28: వారిద్దరూ బీఆర్ఎస్ నాయకులు. అందులో ఒకరు వైరా ప్రస్తుత ఎమ్మెల్యే. మరొకరు రానున్న ఎన్నికల్లో వైరాలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి. బావ.. బావమరిది అంటూ పలుకరించుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వీరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కకపోయినా.. ఎలాంటి మనస్పర్థలకు పోకుం డా.. పదవులు ఉన్నా.. లేకున్నా.. పార్టీ అభివృద్ధి కోసం, ప్రజాసేవలో కలిసి పనిచేస్తామని ఐక్యతను చాటారు. ఇంతకీ ఆ బావ, బావమరిది ఎవరబ్బా అనుకుంటున్నారా? వారే ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బానోతు మదన్‌లాల్. వారి స్నేహాపూర్వక కలయికకు సోమవారం ఖమ్మం జిల్లా వైరా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వేదికైంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ.. ‘కాబోయే వైరా నియోజకవర్గ రథసారథి.. మా బావ మదన్‌లాల్’ అని పేర్కొ న్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్లా ల్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రాములునాయక్ సహాయ సహకారాలు, అండదండల కోసం ఆయన ఆశీర్వాదం తీసుకున్నానని చెప్పారు.