ఓటుకు నోటు కేసుకు కక్ష సాధింపు!
ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆ కేసులో ఫిర్యాదుదారుడైన తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే తన భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఎల్విస్ స్టీఫెన్సన్ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షతోనే భూములపై విచారణకు ప్రభుత్వం జీవో 134 జారీ చేసిందని పేరొన్నారు.
- నిషేధిత జాబితాలో 1936 గజాలు
- నాపై కక్షతోనే జీవో 134 జారీ
- జీవో రద్దుచేసి, భూమిని రక్షించండి
- మాజీ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ పిటిషన్
- సింగిల్‌జడ్జి ముందుంచాలన్న కోర్టు
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆ కేసులో ఫిర్యాదుదారుడైన తనపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, అందులో భాగంగానే తన భూమిని నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఎల్విస్ స్టీఫెన్సన్ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్షతోనే భూములపై విచారణకు ప్రభుత్వం జీవో 134 జారీ చేసిందని పేరొన్నారు.
ఈ జీవోను రద్దు చేయడంతోపాటు సికింద్రాబాద్, బోయిగూడలో తనకు చెందిన 1,936 చదరపు గజాల స్థలాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్ బుధవారం హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీ శ్యాంకోశీ, జస్టిస్ సుద్దాల చలపతిరావుతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చింది. రోస్టర్ ప్రకారం సంబంధిత సింగిల్ జడ్జి ముందు ఈ పిటిషన్‌ను ఉంచాలని ధర్మాసనం రిజిస్ట్రీని ఆదేశించింది. భూముల కొనుగోళ్లలో చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబరు 23న జీవో 134 జారీ చేసిందని స్టీఫెన్సన్ తన పిటిషన్లో పేరొన్నారు.
ఈ జీవో ఆధారంగా ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు, వారి కుటుంబసభ్యులకు సంబంధించిన భూములపైనే విచారణ చేపట్టడం రాజకీయ కక్షసాధింపులో భాగమని ఆరోపించారు. ఈ క్రమంలోనే బోయిగూడలోని తన స్థలాన్ని నిషేధిత జాబితాలో చేర్చారని, ఈ చర్య చట్టవిరుద్ధమని పేరొన్నారు. 2015లో ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ కోటాలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ అయిన తాను ఓటుకు నోటు కేసులో ఫిర్యాదుదారుడినని స్టీఫెన్సన్ వివరించారు. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ఓటును ప్రభావితం చేసేందుకు రూ.50 లక్షలు లంచంగా ఇచ్చి ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై తాను చేసిన ఫిర్యాదు ఆధారంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడి చేసి కేసు నమోదు చేసిందని, అందులో రేవంత్‌రెడ్డిని ఏ-1 నిందితుడిగా పేరొన్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంతో జైలుకు కూడా వెళ్లారని గుర్తుచేశారు. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని పిటిషన్లో ప్రస్తావించారు. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తనపై వేధింపు చర్యలను మరింత తీవ్రతరం చేసిందని, జీవో 134 కూడా అదే క్రమంలో జారీ అయిందని పేరొన్నారు.
బీఆర్ఎస్కు చెందిన నాయకులందరిలోనూ ఎంపిక చేసిన 16 మందికి, వారికి సంబంధించిన వ్యక్తులకు చెందిన భూములనే నిషేధిత జాబితాలో చేర్చి విచారణకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఈ జాబితాలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఆయన మామ ఎం హనుమంతరావు, జగదీశ్వర్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జోగినపల్లి రవీందర్రావు, జే సౌమ్య తదితరులకు సంబంధించిన భూములు ఉన్నాయని పిటిషన్లో పేరొన్నారు. భూములపై విచారణ పేరుతో తమ హకులకు భంగం కలిగించే ప్రయత్నం జరుగుతున్నదని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

