కరెంట్ పోల్‌పైనే ఎలక్ట్రీషియన్ దుర్మరణం
ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ విద్యుత్తు స్తంభంపైనే మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రికత్తతకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడ గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మోతీరాం (35) కొంతకాలం క్రితం విద్యుత్తు లైన్‌మన్ వద్ద పనిచేసి మానేశాడు.
ఎదులాపురం, జూన్ 9 : ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ విద్యుత్తు స్తంభంపైనే మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రికత్తతకు దారితీసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడ గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిషియన్ మోతీరాం (35) కొంతకాలం క్రితం విద్యుత్తు లైన్‌మన్ వద్ద పనిచేసి మానేశాడు. తాజాగా ఆదివారం విద్యుత్తు మరమ్మతుల కోసం స్తంభం ఎక్కాడు. ఒక్కసారిగా విద్యుత్తు సరఫరా కావడంతో ఆయన స్తంభంపైనే మృతి చెందాడు. మోతీరాం కుటుంబ సభ్యులను ఆదుకోవాలని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు మృతదేహాన్ని కిందికి దింపేది లేదంటూ అక్కడే బైఠాయించారు. దీంతో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు మృతదేహం స్తంభం పైనే వేలాడుతూ ఉండిపోయింది. రూరల్ పోలీసులు, విద్యుత్తు అధికారులు గ్రామానికి చేరుకుని సముదాయించడంతో మృతదేహాన్ని కిందికి దింపారు. మోతీరాం భార్య ప్రతిభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ ఎస్సై ముజాహిద్ తెలిపారు. లైన్‌మన్, జూనియర్ లైన్‌మన్‌కు తెలియకుండా మోతీరాం కరెంటు పోల్ ఎక్కి ప్రమాదవశాత్తు మృతిచెందాడని, ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆదిలాబాద్ రూరల్ అడిషనల్ అసిస్టెంట్ ఇంజినీర్ తిరుపతిరెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అన్నివర్గాలను అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్’
Suspension | ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన..తహసీల్దార్ సస్పెన్షన్
గోన రవీందర్ రావుకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Health tips | నెయ్యి తింటే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏమంటున్నారంటే..?
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమా ప్రారంభోత్సవానికి వేళాయె.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన దర్శకుడి భార్య!
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

