హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): స్వేరోస్ సంస్థ నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక స్వేరోస్ రాష్ట్ర చీఫ్ కన్వీనర్ బల్గురి దుర్గయ్య ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. స్వేరోస్ రాష్ట్ర అధ్యక్షుడిగా చిలకబత్తిని వీరయ్య, ప్రధాన కార్యదర్శిగా దారమల్ల ప్రకాశ్, కోశాధికారి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. అధికార ప్రతినిధిగా ప్రణీత శుభశ్రీ, ఉపాధ్యక్షులుగా మచ్చ నరసయ్య, శ్యామల, అజయ్, జగన్లను ఎన్నుకున్నారు.
పులేందర్, రాజు, సాయన్న, దిలీప్, మౌనిక, కిరణ్, కపిల్, రవి, మారుతి, సురేశ్, రాజు, మనోజ్, ప్రవీణ్, పవన్, రాజ్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మామిడాల ప్రవీణ్, వైస్ చైర్మన్ బాలప్రసాద్, ఉషన్న, ఎర్రోళ్ల సత్యం, పుల్లా కిషన్, గడప రాజు తదితరులు పాల్గొన్నారు.