AVNL Posts | భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్) దేశవ్యాప్తంగా ఉన్న యూనిట్లలో నిర్దిష్ట కాల ఉద్యోగుల (Fised Term Employee) ప్రాతిపదికన 1213 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఎగ్జిక్యూటివ్ (జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, అడిషనల్ జనరల్ మేనేజర్, కన్సల్టెంట్) 208, నాన్ ఎగ్జిక్యూటివ్ (జూనియర్ టెక్నీషియన్) 1005 పోస్టులు ఉన్నాయి.
జూనియర్ టెక్నీషియన్‌కు నెలకు రూ. 25,050, జూనియర్ మేనేజర్‌కు రూ. 34,500, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ. 45,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ. 55,000, సీనియర్ మేనేజర్‌కు రూ. 76,500, డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు రూ. 87,000, అడిషనల్ జనరల్ మేనేజర్‌కు రూ. 1,008,000, కన్సల్టెంట్‌కు రూ. 1,29,000 జీతం ఇస్తారు.
నాన్ ఎగ్జిక్యూటివ్ (Executive) పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఎన్సీవీటీ గుర్తింపు పొందిన ఎన్టీసీ/ఎన్ఏసీ ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, సీఏ, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి.
జూనియర్ టెక్నీషియన్, జూనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు గరిష్ఠంగా 30 ఏండ్లు, మిగితా వాటికి 65 ఏండ్లు మించకూడదు.
జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ట్రేడ్ టెస్ట్ (క్వాలిఫయింగ్) పరీక్షల ఆధారంగా, ఎగ్జిక్యూటివ్ పోస్టులను బట్టి కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ప్రజెంటేషన్, ఉద్యోగ అనుభవం ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఫీజు రూ. ౩౦౦. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 25. దరఖాస్తు, ఇతర వివరాలకు https://avnl.co.in వెబ్సైట్లో చూడండి.