హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర నూతన అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా ఎం పర్వత్రెడ్డి, జీ సదానందంగౌడ్ ఎన్నికయ్యారు. ఎస్టీయూ 77వ వార్షిక కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. 2024-25 సంవత్సరానికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇది వరకు సదానందంగౌడ్ అధ్యక్షుడిగా, పర్వత్రెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఉండగా, ప్రస్తుతం ఒకరి స్థానంలో మరొకరు మారారు. ఆర్థిక కార్యదర్శిగా ఆట సదయ్యతో 10 మంది అసోసియేట్ అధ్యక్షులుగా, 24 మంది ఉపాధ్యక్షులుగా, 10 మంది అదనపు ప్రధాన కార్యదర్శులుగా, 24 మంది కార్యదర్శులుగా, 8 మంది ఆర్థిక కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.