బీజేపీకి ఈసీ షాక్.. ఆ ప్రచారంపై తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం షాకిచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బీజేపీ మొదలు పెట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. సాలు దొర – సెలవు దొర ప్రచారంపై ఈసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా సాలు దొర – సెలవు దొర అంటూ ఆయన బొమ్మతో పోస్టర్లు ముద్రించొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఆ పోస్టర్ల ముద్రణకు సంబంధించిన అనుమతిని ఈసీ నిరాకరించింది. రాజకీయ పార్టీలకు చెందిన నేతలను కించపరిచేవిధంగా పోస్టర్లు, ఫోటోలు, రాతలు ఉండకూడదని ఎన్నికల కమిషన్ ఖరాఖండీగా చెప్పింది. సాలు దొర – సెలవు దొర క్యాంపెయిన్‌కు ఎన్నికల కమిషన్ మీడియా సర్టిఫికేషన్ కమిటీ అనుమతి నిరాకరించింది.
సాలు దొర-సెలవు దొర క్యాంపెయిన్‌కు అనుమతి కోరుతూ మీడియా సర్టిఫికేషన్ కమిటీకి బీజేపీ దరఖాస్తు చేయగా.. ఎన్నికల కమిషన్ అనుమతి నిరాకరించింది. బీజేపీ విజ్ణప్తిని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. 2019 ఎన్నికలకు ముందు సుప్రీం కోర్టు ఆదేశాలతో మీడియా సర్టిఫికేషన్ కమిటీని ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

